భారత రాజ్యాంగ పితామహుడు డా.బి.ఆర్.అంబేద్కర్ 67 వ వర్దంతి సందర్భంగా ఎల్బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని హస్తినపురం డివిజన్ సుభాష్ చంద్రబోస్ కాలనీ, చంపాపేట డివిజన్ కటికొనికుంట వద్ద ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
- Advertisement -
ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా విఖ్యాతుడైన అంబేద్కర్ కి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు,కార్యకర్తలు,బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు.