తెలుగుప్రభ క్యాలెండర్, డైరీని ఎస్సై నవీన్ కుమార్, తహసీల్దార్ ఎల్ వీర్ సింగ్, ఎంపీడీఓ రాజ శ్రీనివాస్ లు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పత్రికలు సమాజంలోని ప్రజలకు ఎల్లవేళలా విషయాలు చేరవేరుస్తున్నాయని, ప్రజా సమస్యలు వెలికితీయడంలో మీడియా ముందుండాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో మీడియా పాత్ర గొప్పదని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా పనిచేస్తుందని తెలిపారు. తెలుగుప్రభ దినపత్రిక మరింత ముందుకు కొనసాగాలని కోరారు.