Friday, September 20, 2024
HomeతెలంగాణPalakurthi: ప్రచారంలో దూసుకుపోతున్న దయన్న

Palakurthi: ప్రచారంలో దూసుకుపోతున్న దయన్న

మళ్లీ వస్తే గిరిజన బంధు ఇస్తాం

పాలకుర్తి మండలం సిరిసన్న గూడెం, కంభాలకుంట తండాలో విస్తృతంగా ప్రచారం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు .. ఈ సందర్భంగా తండాలో ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్‌కు ముందు తండాల పరిస్థితి ఏందీ..? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆనాడు తాగునీళ్ల కోసం ఎంత కష్టపడ్డారో చూడాలన్నారు. ఆనాడు తండాలు మంచం ఎక్కాయని.. విష జ్వరాలతో మంచాలు ఎక్కువని ఆయన గుర్తుచేశారు. ఇవాళ తాగునీటి కష్టాలు లేవని, మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇస్తున్నామన్నారు. 2009లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని పెట్టిందని.. మరి చేసిందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అన్ని తాండలను గ్రామ పంచాయతీలు చేశారన్నారు. విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు.

- Advertisement -

రిజర్వేషన్లతో ఎంతో మంది గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారన్నారు. గిరిజన గూడేలకు, తండాలకు త్రీ ఫేజ్‌ కరెంట్ ఏర్పాటు చేశారన్నారు. మళ్లీ కేసీఆర్‌ వస్తే గిరిజన బంధు ఇస్తారన్నారు. గ్రామ పంచాయతీలు కొత్తవి కట్టుకుంటున్నామని, అలాగే ఎన్నికల్లో గెలువగానే ప్రతి రేషన్‌కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తామని, గ్యాస్‌ సిలిండర్‌ రూ.400 ఇస్తామన్నారు. మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ ఒక్కవైపు ఉంటే.. మాట తప్పని కేసీఆర్ ఒకవైపు ఉన్నారన్నారు. మీరంతా సేవాలాల్, కొమరం భీం వారసులని.. అందరూ సరైన ఆలోచన చేయాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News