సౌకర్యవంతమైన జీవితం, సిటీ లైఫ్, ఇవేవీ తనకు తృప్తిని ఇవ్వలేదంటూ , నిరంతరం ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారితో నిత్యం మమేకమవటంలోనే సంతృప్తి ఉందని కందాళ దీపిక అన్నారు. నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తనను తెలుగు ప్రభ ప్రతినిధి సంప్రదించగా పై విధంగా తెలియజేశారు. తన తండ్రిని గెలిపించే క్రమంలో మా శక్తి మేరకు మేము ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని, పాలేరు ప్రజల అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అవ్వాలని నేను నాతో పాటు నా తల్లి విజయమ్మ, నా సహోదరి దీప్తి , నాన్నకు తోడుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. నాన్నకు నిత్యం తన పాలేరు ప్రజల యోగక్షేమాలే ముఖ్యమని, నిరంతరం ప్రజల అభివృద్ధి కోసమే ఆలోచిస్తాడని, పేద ప్రజలకు మన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందించాలని మాతో చెపుతారని తెలియజేశారు. మాకంటే కూడా మా నాన్న కందాళ ఉపేందర్ రెడ్డి ఈ పాలేరు ప్రజల కోసమే ఎక్కువగా ఆలోచిస్తారని, అందుకే మేము కూడా ఈ గెలుపులో భాగస్వామ్యం కావాలని ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం అన్నారు. అందుకే గ్రామంలో ఉన్న గడపగడపకు వెళ్లి నాన్న చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రతి ఒక్కరిని ఈ నెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో పాలేరు బి ఆర్ ఎస్ అభ్యర్థిగా కారు గుర్తుపై పోటీ చేస్తున్న నాన్న కందాళ ఉపేందర్ రెడ్డి నీ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలియజేశారు.