సంక్రాంతి పండుగను గంగిరెద్దుల నాటకాలతో, ఇండ్ల ముందు రంగు రంగుల తీరౌక్క ముగ్గులతో మహిళలు రుచికరమైన నోరూరించే వివిధ రకాల పిండివంటలతో, చిన్న పెద్దా అని తేడా లేకుండా గాలిపటాలు ఎగరవేసి అందరూ కలిసి సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా రామడుగు మండలం గుండి గ్రామంలో స్వాతి సంధ్య అనే అక్కా చెల్లెలు నేటి యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉంటున్న సెల్ఫోన్ అందులో వినియోగిస్తున్న ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్ చాట్, యూట్యూబ్ ఇతరత్రా సోషల్ మీడియా యాప్లను రంగడించి ముగ్గులను వేశారు. దారివెంట పోయే చూపరులు ఆ ముగ్గులను చూసి అక్కాచెల్లెళ్లను అభినందించారు.