Independence Day Hyderabad Cancer Camp: 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో రెండు కీలక కార్యక్రమాలు జరిగాయి. మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించగా, CREDAI హైదరాబాద్ ప్రాపర్టీ షో 2025 హైటెక్స్‌లో ఘనంగా మొదలైంది.
గుడ్ న్యూస్..
మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ప్రజలకు శుభవార్త తెలిపింది. ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించి, ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహన పెంపు లక్ష్యంగా ముందడుగు వేసింది. మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో.. మమ్మోగ్రఫీ, పాప్‌స్మియర్, పీ.యూ.ఎస్ వంటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించారు.
‘మనం సైతం’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై.. “తొలి దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే పూర్తి నివారణ సాధ్యం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి” అని పేర్కొన్నారు. మెడికవర్ చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ డెగ్లూర్కర్ మాట్లాడుతూ.. “అత్యాధునిక సాంకేతికతతో సకాలంలో చికిత్స అందించడం మా లక్ష్యం” అని తెలిపారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/hyderabad-independence-day-2025-cancer-camp-property-show/
శిబిరంలో ఉచితంగా అందించే పరీక్షలు:
మమ్మోగ్రఫీ (రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్)
పాప్‌స్మియర్ (సర్వికల్ క్యాన్సర్ పరీక్ష)
పీ.యూ.ఎస్ (పురుషులకు ప్రొస్టేట్ క్యాన్సర్ పరీక్ష)
క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్
ఈ శిబిరం ప్రతి రోజు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 040 6833 4455 నంబర్‌ను సంప్రదించవచ్చు.


