తెలంగాణ ఇంటర్ బోర్డు(Inter Board) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతున్న సెంటర్లలో సీసీ కెమెరాలు(CC Cameras) ఏర్పాటు చేసింది. 417 కాలేజీల్లో అద్దెకు సీసీ కెమెరాలు తీసుకుంది. మరోవైపు ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
90 శాతం సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఎగ్జామ్ సెంటర్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో పేపర్ ఓపెన్ చేసే రూంలో, సెంటర్ ఎంట్రన్స్‌లో, కారిడార్, గ్రౌండ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అయితే కొన్ని కార్పొరేట్ కాలేజీలు మాత్రం సీసీ కెమెరాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కాలేజీలకు పరీక్ష కేంద్రాలు ఇవ్వడం లేదు.