Saturday, November 15, 2025
HomeతెలంగాణCongress: కాంగ్రెస్‌లో మంత్రి పదవి చిచ్చు.. భగ్గుమంటున్న సీనియర్‌ నేతలు

Congress: కాంగ్రెస్‌లో మంత్రి పదవి చిచ్చు.. భగ్గుమంటున్న సీనియర్‌ నేతలు

Minister Post To Azharuddin Internal Fighting in Congress: టీమిండియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం పట్ల ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్‌లు తీవ్ర విమర్శలు చేశాయి. అయితే దీనిపై అధికార కాంగ్రెస్‌లోనూ అంతర్యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. అజారుద్దీన్‌ మంత్రి పదవి ఆ పార్టీలో చిచ్చు పెట్టింది. అధిష్ఠానంపై సీనియర్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

- Advertisement -

ఓడిపోయిన అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇవ్వడం ఏంటని కాంగ్రెస్‌ అధిష్టానంపై పార్టీ సీనియర్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే మైనారిటీ ఓట్ల కోసమే అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇచ్చామని కాంగ్రెస్ అధిష్ఠానం సమాధానం చెప్పినట్లుగా సమాచారం. అలాంటప్పుడు తమ పేర్లు ఎందుకు పరిశీలనలోకి తీసుకోలేదని సీనియర్‌ నేతలు ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. తమకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.  

Also Read: https://teluguprabha.net/telangana-news/ktr-dares-revanth-reddy-cancel-schemes-and-jubilee-hills-voters-will-topple-your-govt/

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో మైనారిటీ ఓట్ల కోసమే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారంటూ విపక్ష నేతలు రాజకీయ ప్రచారంలో తమ అస్త్రంగా వాడుకుంటున్నారు. ఓ దేశ ద్రోహికి మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ విమర్శలు చేస్తున్నారు. కాగా, జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ కుమార్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఈ రేసు నుంచి అంజన్‌ కుమార్‌ తప్పుకున్నారు. అలాంటప్పుడు తనకు ఎందుకు ఏ పదవి ఇవ్వలేదని అంజన్ కుమార్ ఫైర్ అయ్యారు. 

ఇక 10 ఏళ్ళుగా బీఆర్ఎస్‌తో కొట్లాడిన తనను ఎందుకు పక్కన పెట్టారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్ రెడ్డి సైతం అధిష్ఠానాన్ని నిలదీసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంపై మధుయాష్కీ గౌడ్, జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తమకు చెప్పకుండా, ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని సీనియర్లు గుర్రుమంటున్నారు. అజారుద్దీన్‌కి మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్‌ నేతలు.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. 

Also Read: https://teluguprabha.net/telangana-news/jubilee-hills-bypoll-revanth-reddy-fires-at-brs-bjp-secret-bond-promises-mega-development/

రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు కీలకంగా మారిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో.. కాంగ్రెస్‌ పార్టీలో ఏర్పడిన మంత్రి పదవి చిచ్చు ఎంతవరకు రాజుకుంటుందో వేచి చూడాలి. మరి దీనిపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad