రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయటం పూర్తిగా అప్రజాస్వామికం.. ఐఎన్టియుసి నేత జనక్ ప్రసాద్ ఆరోపించారు. దేశంలో రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా జనక్ ప్రసాద్ నాయకత్వంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. గోదావరిఖని లోని జనక్ భవన్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు పూర్తిగా చట్టవిరుద్ధం అని ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూని చేశారని ఆరోపించారు. ఆనాడు పార్లమెంట్ నిండు సభలో మా నాయకురాలు రేణుకా చౌదరిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శూర్పణఖ అని అనలేదా మరి దానికి ప్రధాన మంత్రికి ఏం శిక్ష వేయాలో బీజేపీ నాయకత్వం తెలపాలన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ ఎంపీ ప్రజ్ఞసింఘ్ సాధ్వి మహాత్మా గాంధీని దేశ ద్రోహి అని కించపర్చి గాడ్సేను దేశ భక్తుడిగా కొనియాడిన ఆ ఎంపీకి ఏం శిక్ష వేయాలో.. బీజేపీ నాయకత్వం తెలుపాలన్నారు. సింగరేణి అర్జీ1 ఉపాధ్యక్షులు సదానందం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో
సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, జనరల్ సెక్రటరీ లక్ష్మి పతి గౌడ్ , సెంట్రల్ జాయింట్ జనరల్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్, బ్రాంచ్ సెక్రటేరీలు బూర జగన్మోహన్, నీరటీ సాగర్, గడ్డం వెంకటేశ్వర్లు, తాటి రాజయ్య, అల్లావుద్దీన్ పిట్ సెక్ర టరీలు దేవాచారీ , గణపతి దామోదర్ ఆంజనేయులు, చంద్రా రెడ్డి, వెల్తురు సత్యనారాయణ, కుమారస్వామి పాల్గొన్నారు.
INTUC: రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు అప్రజాస్వామికం
జనకప్రసాద్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష