ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta)లో నిర్వహించనున్న శ్రీశ్రీ సుదర్శన లక్ష్మీనారసింహ దివ్యస్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు జరగనున్న ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, యాదగిరిగుట్ట ఆలయ ఈవో, అర్చకులు ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు.