ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని పోలీస్ మెస్ లో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. రాష్ట్ర డిజిపి శ్రీ రవి గుప్తా, రోడ్ సేఫ్టీ అధారిటీ చైర్మన్ శ్రీ అంజనీ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ శ్రీ బి. శివధర్ రెడ్డి, శ్రీ గోవింద్ సింగ్ తదితర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ రవి గుప్తా అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డిజిపి శ్రీ రవి గుప్తా మాట్లాడుతూ…. తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికి ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలిచిందని, ముందుముందు కూడా అదే స్థాయిలో పనిచేసి రాష్ట్ర ప్రజల భద్రతను కాపాడతామని ఆయన చెప్పారు.
డీజీపీ శ్రీ రవి గుప్తా అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, “మీ అందరికీ చాలా సంతోషకరమైన, ఐశ్వర్యపూరితమైన, ఆరోగ్యకరమైన కొత్త సంవత్సర శుభాకాంక్షలు” అని అన్నారు. తెలంగాణ పోలీసుల సమిష్టి విజయాల గురించి ఆయన మాట్లాడుతూ… తెలంగాణ పోలీసులు దేశంలో ఎల్లప్పుడూ అగ్రగామి. మేము జట్టుగా పనిచేశాం, జట్టుగా చేసే పని ఎల్లప్పుడూ సత్ఫలితం ఇస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు.
2023లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు, బోణాలు, దసరా వంటి పండుగల గురించి ప్రస్తావిస్తూ, కొత్త ఏడాదిలో కూడా ఇదే విధంగా అప్రమత్తంగా పనిచేస్తామని డీజీపీ రవి గుప్తా అన్నారు. ప్రత్యేకంగా సైబర్ నేరాల పెరుగుదల, డ్రగ్స్ అమ్మకాలు,మహిళా భద్రత పెంపు వంటి విషయాలపై ఎక్కువ దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. భద్రత, ట్రాఫిక్ నిర్వహణ లాంటి విషయాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. గ్రామీణ స్థాయిలో ప్రజలతో మరింత సన్నిహితంగా మెలగాలి అని ఆయన సూచించారు.
టెక్నాలజీని వినియోగించుకుని, పోలీసింగ్‌ను మరింత పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని …డీజీపీ శ్రీ రవిగుప్తా నొక్కిచెప్పారు. “ప్రజలే మన బలం. వారి భద్రతే మన ప్రధాన ధ్యేయం. కొత్త ఏడాదిలో కూడా అదే నిబద్ధతతో పనిచేసి, తెలంగాణ పోలీసుల పనితీరును మరో సారి చాటి చెపుతామన్నారు. దేశంలోనే మేటి పోలీస్ వ్యవస్థగా మన తెలంగాణ పోలీసుల కీర్తి ఎల్లప్పుడూ నిలిచిపోవాలన్నారు.