Sunday, January 18, 2026
HomeతెలంగాణKTR: అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్: కేటీఆర్

KTR: అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్: కేటీఆర్

‘అక్కరకు రాని చుట్టం.. మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునదా.. నెక్కిన బారని గుర్రం..గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!’ అన్న పద్య రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్ . మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం. మోసానికి మారు పేరు కాంగ్రెస్. ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్. రైతుద్రోహి ముఖ్యమంత్రి రేవంత్. రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒడ్డెక్కి తెడ్డుచూపిన ఇందిరమ్మ రాజ్యం. అన్నింటా మోసం .. వరంగల్ డిక్లరేషన్ అబద్దం. రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకం. ప్రచారం రూ.15 వేలు- అమలు చేస్తామంటున్నది రూ.12 వేలు. సిగ్గు సిగ్గు. ఇది సర్కారు కాదు. మోసగాళ్ల బెదిరింపుల మేళా. అబద్దానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్. మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్!” అని కేటీఆర్ విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News