Saturday, November 15, 2025
HomeతెలంగాణJadcharla: లలితా త్రిపుర సుందరీ దేవిగా బంగారు మైసమ్మ దేవత

Jadcharla: లలితా త్రిపుర సుందరీ దేవిగా బంగారు మైసమ్మ దేవత

అమ్మా..చల్లగా చూడు..

దసరా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 44వ జాతీయ రహదారి పక్కన, ఐబి (డాగ్) బంగ్లా సమీపంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత 4వ రోజు ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

- Advertisement -

గణపతి పూజ అనంతరం శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతకు అభిషేకం, దేవి నవరాత్రోత్సవ పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి పులిహోర నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గోనెల నరేందర్ మహేశ్వరి దంపతులు, ఘనాతే విజయ్ కుమార్ గౌతమి ప్రియాంక దంపతులు, గుండు చంద్ర శేఖర్, భక్తులు గజగౌని రమేష్ గౌడ్ సుప్రియ దంపతులు, పండ్ల దేవరాజు లక్ష్మమ్మ దంపతులు, శ్రీనివాసులు సీత దంపతులు, గజగౌని రేవంత్ గౌడ్, రుత్విక, శృతి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad