Sunday, September 8, 2024
HomeతెలంగాణJadcharla: అజ్ఞానందకారాన్ని తొలగించేది గురువు

Jadcharla: అజ్ఞానందకారాన్ని తొలగించేది గురువు

ప్రధానోపాధ్యాయులు మహేష్

అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదని కావేరమ్మపేట శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు గోస్కే మహేష్ అన్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకొని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ప్రధానాచార్యులు మహేష్ వ్యాస మహాముని, సరస్వతి దేవి, భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధానాచార్యులు మాట్లాడుతూ గురువుల విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఆషాడ శుద్ధ పౌర్ణమి వ్యాస మహాముని జన్మ తిథి పురస్కరించుకొని గురు పౌర్ణమి నిర్వహించుకుంటున్నామని, గురువులను పూజించే గొప్ప దేశం భారతదేశం అని, భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.

కార్యక్రమంలో పాఠశాల సభ్యులు పెండ్యాల నరసింహులు, ఆచార్యులు జి. సుష్మ, ఎస్. శ్రీలక్ష్మి, కె. ఎల్లమ్మ, కె. అరుణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News