బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు జడ్చర్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో జడ్చర్ల అంబేద్కర్ పూలే చౌరస్తాలో కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకున్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు ఘనంగా నిర్వహించారు. హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అంటూ నినదించారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ యాదయ్య, పార్టీ మండల అధ్యక్షులు రఘుపతి రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ పిట్టల మురళి, నాయకులు ప్రనిల్ చందర్, రామ్మోహన్, రంజిత్ బాబు, వీరేష్, ఇమ్ము, కౌన్సిలర్లు సతీష్, కోట్ల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.