Saturday, October 12, 2024
HomeతెలంగాణJadcharla: మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి సతివియోగం

Jadcharla: మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి సతివియోగం

అనారోగ్యంతో చికిత్స తీసుకుంటూ..

మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత రెడ్డి (60) సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్వేత రెడ్డి మృతి చెందారు.

- Advertisement -

అంత్యక్రియలు స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో నేడు మంగళవారం నిర్వహించనున్నట్లు సమాచారం. వారికి ఇద్దరు సంతానం. ఎమ్మెల్యేగా లక్ష్మారెడ్డి పోటీ చేసిన సందర్భాల్లో ఆమె ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని భర్త గెలుపునకు కృషి చేసేది.

లక్ష్మారెడ్డికి కొండంత అండగా నిలిచిన శ్వేతా రెడ్డి మరణం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటును మిగిల్చింది. ఆమె పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని మనసారా వేడుకున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News