Tuesday, September 10, 2024
HomeతెలంగాణJadcharla: మొక్కలు పచ్చదనంతో పాటు వ్యాధుల నుంచి కాపాడతాయి

Jadcharla: మొక్కలు పచ్చదనంతో పాటు వ్యాధుల నుంచి కాపాడతాయి

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

మొక్కలు పచ్చదనంతో పాటు వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సూచించారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 5 నుండి 9 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం జడ్చర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటి నీరు పోశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని రక్షించాలన్నారు. నా గ్రామం నా గౌరవం నినాదంతో గ్రామాలు, పట్టణాల్లో జరిగే పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు, వన మహోత్సవంలో ప్రజలు పాలుపంచుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 6న తాగునీటిని అందించే ట్యాంకుల శుభ్రత, క్లోరినేషన్‌, ఇంకుడు గుంతల ఏర్పాటు, చెరువులను సంరక్షణ, కలుషితం కాకుండా చూడటం, 7న గ్రామాలు, పట్టణాల్లోని ముంపు ప్రాంతాల్లో మురుగా నీరు నిలువకుండా చర్యలు తీసుకోవడం, మురుగునీటి గుంతలను పూడ్చటం, 8న సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం, వీధి కుక్కలను యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌కు తరలించడం, ఇళ్లలో నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్‌ బాల్స్‌ వేయడం, 9న శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వాటిని తొలగించే చర్యల చూపట్టడం, రోడ్లకు ఇరువైపులా ఎండి పోయిన చెట్లను తీసేయడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారని అందులో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి మంగళ, శుక్రవారాన్ని డ్రై డేగా పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారని, ప్రతి ఇంటికి ప్లాంటేషన్ కింద 6 మొక్కలు పంపిణీ చేస్తారని వాటిని నాటి సంరక్షించాలని తెలిపారు.

కార్యక్రమంలో నాయకులు బుర్ల వెంకటయ్య, సయ్యద్ మీనాజుద్దీన్, బుక్క వెంకటేశం, ఖాజా, బాలకృష్ణ, ఆనంద్, మల్లికార్జున్, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంఈఓ మంజులా దేవి, మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News