Tuesday, October 1, 2024
HomeతెలంగాణJadcharla: అక్రమాలు ఎవరు చేసిన వదిలి పెట్టను

Jadcharla: అక్రమాలు ఎవరు చేసిన వదిలి పెట్టను

ఉదండాపూర్ అక్రమాలు గుర్తించడానికి ఇంటింటికి తిరుగుతా

ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అక్రమాలు అడ్డుకోవడానికి, బోగస్ వ్యక్తులను గుర్తించడానికి అవసరమైతే నేను ఇంటింటికి తిరుగుతానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఉదందాపూర్ రిజర్వాయర్ ముంపు ప్రాంతాల్లో భూములకు, గ్రామాల్లో కుటుంబాలకు పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ కు చెందిన నాయకులు అక్రమాలు చేయడానికి భూముల రికార్డులను ట్యాంపర్ చేసి ప్రభుత్వ భూములను కూడా తమవిగా చూపించి పరిహారం మొత్తాలను తీసుకోవడంతో పాటు ఇతరుల భూములకు సంబంధించి రావాల్సిన మొత్తాలను కూడా తమ బినామీ ఖాతాలకు మల్లించుకున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని మంగళవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఆర్అండ్ఆర్ కింద వచ్చే పరిహారాన్ని కూడా స్వాహా చేయడానికి గ్రామానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లతో బోగస్ కుటుంబాలను కూడా జాబితాలో చేర్చారని కూడా తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అయితే ఇలాంటి అక్రమాలు ఎవరు చేసిన, వాటి వెనుక ఎంతటి పెద్ద మనుషులు ఉన్న తాను సహించనని స్పష్టం చేశారు. పోలేపల్లి పంచాయితీలో జరిగిన అక్రమాలను గురించి తాను అధికారులకు ఫిర్యాదు చేయడం, అధికారుల విచారణలో అవి నిజమేనని తేలిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాబోయే ఆరు నెలల కాలంలో ఉదందాపూర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అధికారులు కూడా అవార్డు పాస్ చేయడానికి ముందుగానే అక్రమాలు గుర్తించి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలని కోరారు. అక్రమాలకు అధికారులు సహకరించిన దాఖలాలు ఉంటే వారిపై కూడా చర్యలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో జరిగిన అక్రమాలను గురించి తన దృష్టికి తీసుకురావాలని, బాధితులు జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News