Friday, September 20, 2024
HomeతెలంగాణJadcharla: ఘనంగా నాభిశిల బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం

Jadcharla: ఘనంగా నాభిశిల బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం

గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ..

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో నాభి శిల బొడ్రాయి ప్రతిష్టాపన ప్రథమ వార్షికోత్సవాన్ని కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు బోనాలతో బొడ్రాయి నాభిశిల ప్రాంగణానికి తరలివచ్చి బోనాలను సమర్పించి వారి మొక్కులను తీర్చుకున్నారు. వేద పండితులు మంత్రోచరణాల మధ్య నాభిశిల బొడ్రాయికి ప్రథమ వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రత్యేకంగా అభిషేకాలు, కుంకుమార్చన విశేష పూజలు నిర్వహించారు.

- Advertisement -

నాభి శిల బొడ్రాయిని దర్శించుకున్న ప్రజలు మా గ్రామాన్ని చల్లంగా చూడు తల్లి అంటూ తమ మొక్కలు తీర్చుకుంటూ, వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని నైవేద్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నాభిశిల బొడ్రాయి ప్రాంగణానికి గ్రామంలోని పెద్దలు, మహిళలు, యువతి, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సకల దేవతల ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు.

కార్యక్రమంలో గోనెల శంకర్, నారాయణ, బుక్క లక్ష్మయ్య, యాదయ్య, పర్వతాలు, గిరిమోని రామకృష్ణ, చెన్నయ్య, గుండు మురళి, మిద్దె నారాయణ, శేఖర్, గోపాల్, మిద్దె నాగరాజు, బుక్క శివ, నర్సింలు, వెంకటయ్య, కౌన్సిలర్ మహేష్, గుండు శ్రీశైలం, హనుమంతు, శాంతల్ గౌడ్, రాములు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News