Wednesday, October 30, 2024
HomeతెలంగాణJadcharla: పెద్దగుట్టపై కోనేరు పూడ్చివేతపై ప్రజల ఆగ్రహం

Jadcharla: పెద్దగుట్టపై కోనేరు పూడ్చివేతపై ప్రజల ఆగ్రహం

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాదేపల్లి పెద్దగుట్టపై ఉన్న పురాతన రంగనాయక స్వామి గుండాన్ని పూడ్చివేశారు. గుట్టపై ఉన్న అతి పురాతనమైన శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఎదురుగా పకృతి సహజసిద్ధంగా పెద్ద రాళ్ల మధ్య ఏర్పడిన కోనేరు (గుండం) మూసివేతపై జడ్చర్ల మున్సిపాలిటీ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటి ప్రాచుర్యం ఉన్న గుండాన్ని పూడ్చిన ఫోటోలు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టాయి. ఇంతకూ గుట్టపై ఏం జరుగుతుందంటూ పోస్టులు చేస్తున్నారు. శుక్రవారం దేవాలయ అభివృద్ధి పేర బాదేపల్లి పెద్దగుట్టపై వెలిసిన శ్రీ రంగనాయక స్వామి దేవాలయ ఎదురుగా స్వయంగా వెలిసిన (గుండం) కోనేరును మూసివేత, దేవాలయం పక్కనే ఉన్న చింత చెట్టు తొలగింపును జడ్చర్ల మున్సిపాలిటీ ప్రజలు, స్వామి భక్తులు తీవ్రంగా ఖండించారు. మూసివేసిన గుండాన్ని తిరిగి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

పట్టణంలో హిందూ సంఘాల ఆందోళన:

గుండం పూడ్చివేతపై నేడు శనివారం ఉదయం అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళనకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ధర్నా అనంతరం తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించి, గుట్టని సందర్శించాలని నిర్ణయించారు. గుండం పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News