Monday, December 9, 2024
HomeతెలంగాణJadcharla: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం

Jadcharla: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం

సంక్షేమం కోసం..

తెలంగాణ విద్యార్థులను చదువులో ప్రపంచంతో పోటీపడే విధంగా తయారు చేస్తామని, అందుకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేసి ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

- Advertisement -

జడ్చర్ల నియోజకవర్గం పెద్దాయిపల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఇంటిగ్రేటెడ్ విద్యా విధానంలో భాగంగా నియోజకవర్గంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు చేస్తుందని, దాదాపు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు ఉంటారని, రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో అత్యంత ప్రామాణికమైన విద్యను అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇవి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే అందుబాటులోకి వచ్చే విధంగా త్వరగతిన నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఇందులో కేవలం విద్యకే కాకుండా క్రీడలకు కూడ ప్రాధాన్యం ఉంటుందన్నారు.

కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్ల కొత్వాల్, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా ఎస్పీ డి. జానకి, జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News