Sunday, December 8, 2024
HomeతెలంగాణJadcharla: ఎమ్మెల్యేకు థ్యాంక్స్: రెవెన్యూ డివిజన్ సాధన సమితి

Jadcharla: ఎమ్మెల్యేకు థ్యాంక్స్: రెవెన్యూ డివిజన్ సాధన సమితి

పోరాటం..

జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని జడ్చర్ల ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డిని కోరడాన్ని స్వాగతిస్తూ జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి కోఆర్డినేటర్లు వడ్త్యావత్ రమేష్ నాయక్, బూరుగుపల్లి కృష్ణ యాదవ్, నాయకులు భీమ్ రాజ్ తదితరులు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఎంఆర్సి భవనం ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. జడ్చర్లను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని సాధన సమితి ఆధ్వర్యంలో 2016 నుండి నేటి వరకు వివిధ పోరాటాలు, దీక్షలు చేశామని, అధికారులకు రాష్ట్ర మంత్రులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేశామని అన్నారు. అయినా డిమాండ్ సాకారానికి ముందుకు అడుగు పడలేదని, మా పోరాటాలకు గుర్తుగా ఒక అడుగు ముందుకు వేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేడు సీఎం రేవంత్ రెడ్డిని కోరడంతో హర్షం వ్యక్తం చేస్తున్నామని, జడ్చర్ల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కావాల్సిన కార్యచరణకు అవసరమైతే ఎల్లప్పుడూ ఎమ్మెల్యేకు అందుబాటులో ఉండి సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మహేష్, శివ, శంకర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News