దసరా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 44వ జాతీయ రహదారి పక్కన, ఐబి (డాగ్) బంగ్లా సమీపంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత 9వ రోజు శుక్రవారం శ్రీ మహిషాసుర మర్దిని (మహాకాళి) అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి భక్తులు గిరమోని రామకృష్ణ దేవమ్మ దంపతులు, గోనెల నరేష్ రాగవేణి దంపతులు హాజరై ముందుగా గణపతి, గౌరీ పూజ నిర్వహించి, శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతకు అభిషేకం, కుంకుమార్చన, దేవి నవ రాత్రోత్సవ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించి బెల్లం అన్నము నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూజ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ గోనెల నరేందర్ మహేశ్వరి దంపతులు, ప్రధాన కార్యదర్శి ఘనాతే విజయ్ కుమార్, వైస్ చైర్మన్ గుండు చంద్ర శేఖర్, భక్తులు గుండు సాయి ప్రియ, సీత, శ్రీనివాసులు, అయ్యప్ప, రాజు, మాధురి, మహేష్, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.