Monday, December 9, 2024
HomeతెలంగాణJadcharla: జెండాలు వేరైనా అజెండా అభివృద్ధే కావాలి

Jadcharla: జెండాలు వేరైనా అజెండా అభివృద్ధే కావాలి

డబుల్ బెడ్రూం..

ఎన్నికల్లో గెలిచే వరకే రాజకీయాల గురించి మాట్లాడాలని, గెలిచాక పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధి కోసం కలిసి రావాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కోరారు. జెండాలు వేరైనా అందరి అజెండా జడ్చర్ల అభివృద్ధే కావాలని పిలుపు నిచ్చారు.

- Advertisement -

జడ్చర్ల పట్టణంలో తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చడం కోసం రూ.47 కోట్లతో చేపట్టిన అమృత్ పథకానికి బుధవారం అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్లలో తాగు నీటి కొరత ఉందనే విషయం తన దృష్టికి కూడా వచ్చిందని చెప్పారు. మిషన్ భగీరథ పథంలో తరచుగా తలెత్తున్న సాంకేతిక సమస్యలతో తాగు నీటి సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయని, ఇటీవల దసరా పండుగ సమయంలోనూ పట్టణ వాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారని తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో మోటార్లు మారిస్తే తప్ప నీటి సరఫరా మెరుగుపడదని, దాని కోసం కావాల్సిన రూ.3 కోట్లు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కోరామన్నారు. ప్రస్తుతం జడ్చర్లలో రూ.47 కోట్లతో అమలు చేస్తున్న అమృత్ పథకంలో రూ.20 కోట్లు కేంద్ర ప్రభుత్వానివి కాగా రూ.27 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానివని వివరించారు.

ఈ పథకంలో భాగంగా 56 కి.మీ. పొడవైన తాగు నీటి పైప్ లైన్లను ఏర్పాటు చేస్తారని, ఎర్రగుట్ట, నిమ్మబావిగడ్డ, సిగ్నల్ గడ్డ, క్లబ్ రోడ్, బ్రహ్మంగారి గుడి, జాతీయ రహదారి సమీపాల్లో 5 లక్షల నుంచి 15 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన ట్యాంకులను నిర్మిస్తారని అనిరుధ్ రెడ్డి వివరించారు. దీనివల్ల జడ్చర్ల పట్టణంలో 58 లక్షల లీటర్ల తాగు నీటి సామర్థ్యం పెరుగు తుందన్నారు. పట్టణంలో మొత్తం 7954 నల్లాల ద్వారా ఈ నీటిని ప్రజలకు అందిస్తారని చెప్పారు. రాబోయే వేసవి నాటికి ఈ పనులన్నీ పూర్తవుతాయని, దీంతో జడ్చర్లలో తాగు నీటి సమస్య శాశ్వితంగా తీరిపోతుందని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ ఇంచార్జ్ చైర్ పర్సన్ సారిక, కౌన్సిలర్లు, నాయకులు, పబ్లిక్ హెల్త్ డిఇఇ మల్లేష్, మెఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News