Tuesday, September 17, 2024
HomeతెలంగాణJagadish Reddy: చాంపూలాల్ జాతర ప్రారంభించిన మంత్రి

Jagadish Reddy: చాంపూలాల్ జాతర ప్రారంభించిన మంత్రి

గులాబీ జెండా నీడలో గిరిజన తాండాలు శోభయామానంగా మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గిరిజన తాండాలన్ని గ్రామ పంచాయతీలుగా ఆవిష్కృతమయ్యా అని ఆయన తెలిపారు. సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం బడితండా లో గిరిజనులు అత్యంత ప్రాశస్త్యంగా కొలుచుకునే చాంపూలాల్ జాతరను గిరిజనుల సాంప్రదాయాన్నిననుసరించి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి ఆచారం ప్రకారం డప్పులు మ్రోగించి ప్రారంభించారు.

- Advertisement -

అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కోట్లాది రూపాయలతో గిరిజన అవాసాలను అభివృద్ధి పరచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన కొనియాడారు. 2014 కు ముందు 2014 కు తరువాత అన్నది ఒక్కసారి పరికించి చుస్తే జరిగిన పురోగతి ఇట్టే బోధ పడుతుందన్నారు. అంతర్గత రహదారులతో గిరిజన తండాలు కళకళ లాడుతున్నాయని అందుకు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతయే కారణమన్నారు. మిషన్ భగీరథతో గిరిజన తాండాలలో మంచి నీటి ఎద్దడిని నివారించిన ప్రభుత్వం గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు వీలుగా 20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మునుముందు మరింత అభివృద్ధికి గిరిజనులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తోడ్పాటు నందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గులాబీ జెండాయే గిరిజన తాండాలకు నీడ నిస్తుందని ఆ నీడ చాటున యావత్ గిరిజన సమాజం మరింత పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు గిరిజనుల ఆరాధ్య దైవం చాంపూలాల్ ఆశీస్సిలు బలంగా ఉండాలని ప్రార్దించినట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News