Friday, November 22, 2024
HomeతెలంగాణJagadish Reddy: జరిగిన అభివృద్ధికి దశాబ్ది ఉత్సవాలు నిదర్శనం

Jagadish Reddy: జరిగిన అభివృద్ధికి దశాబ్ది ఉత్సవాలు నిదర్శనం

కాంగ్రెస్ నేతలకు మంత్రి జగదీష్ రెడ్డి సవాల్

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధికి జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలు తార్కాణమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారిక లెక్కలు జరిగిన అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనమన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన విద్యా దినోత్సవ వేడుకలలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో గడిచిన తొమ్మిదేళ్ల వ్యవధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యా రంగంలో సాధించిన విజయాలను ఆయన గణాంకాలతో సహా సోదాహరణంగా వివరించారు. అదే సందర్భంగా ఇతర జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి అంటూ చేసిన డిమాండ్ పై ఆయన ఘాటుగా స్పందించారు. తొమ్మిదేళ్ల వ్యవధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని నిరూపిస్తే కాంగ్రెస్ నేతలు ముక్కులు నేలకు రాస్తారా అంటూ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. అదీనూ గల్లీ నుండి ఢిల్లీ వరకు ముక్కులు నేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు.అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే క్షమాపణ చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నమాన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News