కోదాడ నియోజకవర్గం మునగాల మండల కేంద్రంలో కోటి 56 లక్షలతో ప్రాథమిక ఆరోగ్యకేంద్ర భవనం శంఖుస్థాపన చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఅర్ దని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. అందరికీ అందుబాటులో ఆధునిక వైద్యం అందు బాటులో ఉంచాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఅర్ సంకల్పం అని ఆయన పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గం మునగాల మండల కేంద్రంలో కోటి 56లక్షలతో నిర్మించ తలపెట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. స్థానిక శాససభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అరోగ్యవంతమైన తెలంగాణా గా తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ నిర్ణయించారని తెలిపారు. అందులో బాగంగానే పల్లె నుండి పట్నం వరకు అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఎక్కడికక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆసుత్రుల్లో వైద్యం అంటేనే చీదరించుకునే స్థాయి నుండీ వైద్య సేవలు అంటే సర్కార్ ఆసుపత్రిలోనే అనే స్థాయికి చేర్చిన నేత ముఖ్యమంత్రి కేసీఅర్ అని ఆయన కొనియాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించి వదలి పెట్టకుండా ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండడంతో తెలంగాణా సమాజం వైద్య సేవలకు ప్రభుత్వ ఆసుపత్రిలకు తరలి వస్తున్నారన్నారు. పల్లే నుండి పట్టణం లోని బస్తీ దవాఖానలను ఎర్పాటు చేసిన ఘనత యావత్ భారత దేశంలో ఒక్క తెలంగాణా రాష్ట్రానికే దక్కిందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.