శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి విన్నవించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి, శేరిలింగంపల్లిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని జగదీశ్వర్ గౌడ్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాకు గురై అన్యాక్రాంతం అవుతున్నాయని ఆయన ముఖ్యమంత్రితో మొరపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన ప్రజా పాలన ప్రజల విశ్వాసానికి తగ్గట్టు పరిపాలన సాగిస్తుందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి పర్యటించిన ప్రతి కాలనీ బస్తీలలో ప్రజలు సీఎం దృష్టికి తీసుకు వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్ కి సూచించినట్లు తెలిసింది. అన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు, కార్యకర్తలకు అందేలా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.