MSF ఆధ్వర్యంలో ఓయూలో ఘనంగా డా.బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి ఉత్సవం ఘనంగా సాగింది. స్వాతంత్ర్య సమరయోధుడు, పరిపాలనాధ్యక్షుడు సమతావాది డా.బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతిని పురస్కరించుకొని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో MSF తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ అధ్యక్షతన ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా… MSF జాతీయ అధ్యక్షులు సోమశేఖర్ మాదిగ, తీన్మార్ వ్యవస్థాపకులు OU యుద్ధనౌక డా.వరంగల్ రవి లు పాల్గోని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…భారతదేశ రాజకీయాలలో సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా అనేక శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించి దేశానికి ఎనలేని కృషి చేసిన రాజకీయ దురంధరుడు, భారత రాజ్యాంగం దేశంలో ఆమోదం పొందడానికి ముఖ్య కారకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు,భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి ఇంకా భారతరత్న ఇవ్వక పోవడం సిగ్గుచేటు అని అన్నారు, బాబుజీకి తక్షణమే భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారతరత్న ఇచ్చేవరకు MSF ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో BSS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంపటి సైదులు,MRPS రాష్ట్ర కార్యదర్శి దుప్పెల్లి అనిల్ మాదిగ, యెడవెల్లి అజయ్ మాదిగ,కూరపాటి సునీల్ మాదిగ,ఈదుల రాజీవ్ ప్రదీప్ మాదిగ,వీరపాకుల హరి మాదిగ,అశోక్ మాదిగ,చేరుకుపల్లి నరేందర్ ,శాంతి కుమార్, వంశీ, రాజు, మధు, శ్రీకాంత్, అంజి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.