Sunday, October 6, 2024
HomeతెలంగాణJagajjivan Ram society: సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు కేసీఆర్ కు సన్మానం

Jagajjivan Ram society: సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు కేసీఆర్ కు సన్మానం

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు కేసీఆర్ కు సన్మానం తలపెట్టారు బాబూ జగజ్జీవన్ రామ్ సొసైటీ వారు.  ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో బాబు జగ్జీవన్ రామ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి కృతజ్ఞత, అభినందన సభను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంపై రూపొందించిన పోస్టర్ ను కేటీఆర్ ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కేటీఆర్ ను ఆహ్వానించారు సొసైటీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకుడు కొమ్ముల నరేంద్ర. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ కూడా హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News