Tuesday, September 10, 2024
HomeతెలంగాణJagityala-PCB awareness on clay Ganesha: కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో

Jagityala-PCB awareness on clay Ganesha: కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో

మట్టి వినాయక విగ్రహాలను ఫ్రీగా..

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలకు సంబంధించిన పోస్టర్లను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా కేంద్రం లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి పండుగ పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి సందర్భంగా మట్టి వినాయక విగ్రహలను ఉపయోగించాలని ప్రతి జిల్లాకు పంపిణి చేస్తామని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు.

- Advertisement -

జగిత్యాల జిల్లాకు 2000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన విగ్రహలతో చెరువులు కలుషితం కాకుండా మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించి చెరువులను సంరక్షించాలని జిల్లా ప్రజలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కోరారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తరపున ఈ.కనక జ్యోతి. అసిస్టెంట్ సహాయక శాస్త్రవేత్త, కలెక్టరేట్ సూపర్డెంట్ డిడబ్ల్యూ నరేష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News