Saturday, November 2, 2024
HomeతెలంగాణJagityala: వికలాంగుల మహా ధర్నా

Jagityala: వికలాంగుల మహా ధర్నా

హక్కుల కోసం పోరాటం

జగిత్యాల జిల్లా కేంద్రంలో  స్థానిక రామాలయం దేవాలయం నుండి  కొత్త బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీగా వచ్చి వికలాంగుల మహాధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వికలాంగుల నాయకులు మాట్లాడుతూ.. వికలాంగుల హక్కులను అవకాశాలను ప్రభుత్వ పథకాలను ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు సరిగా పట్టించుకోవడం లేదని, అయినా కూడా వికలాంగులు ఆత్మవిశ్వాసంతో గ్రామస్థాయి నుండి హక్కుల అమలుకై నిరంతరాయంగా జగిత్యాల జిల్లా అన్ని గ్రామాల వికలాంగులను ఏకం చేస్తూ చట్టపరంగా, న్యాయంగా అందాల్సిన హక్కులు, పొందాల్సిన పథకాలు సక్రమంగా అందడం లేదన్నారు.

- Advertisement -

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విషయంలో రిజర్వేషన్, రోస్టర్ విధానం తగ్గించడం లేదని, వీటిపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ 4016/- నుండి 6000/- పెంచి, ప్రతి నెల 5వ తారీఖు లోపు ఇవ్వాలని, ప్రభుత్వ మేనిఫెస్టో లోని 29వ నెంబర్ లో పేర్కొన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ మాదిరిగా వికలాంగులకు వెంటనే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లలో 5%  రిజర్వేషన్ అమలు చేస్తూ స్థలం లేని వికలాంగులకు ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జగిత్యాల దివ్యాంగుల కార్యనిర్వాహక సభ్యులు ఏర్పాటు చేసిన దివ్యాంగుల జిల్లా మహా ధర్నాకి పాల్గొన్న దివ్యాంగ ముఖ్య నాయకులు లంక దాసరి శ్రీనివాస్, అస్గర్ మహమ్మద్ ఖాన్, బండి సత్యనారాయణ, తోట సంజీవ్ ,గౌరిశెట్టి చంద్రశేఖర్, మాసం నరసయ్య, సామల ప్రసాద్, మడిశెట్టి రాజు, నేరల శ్రీనివాస్, బెదగం రాజు, ఎండి అఫీజా, గజ్జి వరలక్ష్మి, ధరూర్ లలిత, గుడిసెల గంగాధర్, మాదాసు ప్రవీణ్, జంబుక రాజయ్య, లంక దాసరి దేవదాస్, బొలిశెట్టి రాజేష్, ఓడ్నాల శ్రీనివాసరావు, అబ్దుల్ అజీజ్ టీ.డి.జీ.ఎ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News