జగిత్యాల జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టరాజ్యంగా రోగాల నుండి అందినంతగా దండుకుంటున్నారు. మూడు పువ్వులు ఆరు కాయలుగా విర జిల్లుతున్న జిల్లా యంత్రాంగం ఏమాత్రం పట్టించు కోకపోవడంపై సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది.
గత కొన్ని రోజుల క్రితం ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులకు ఎలాంటి పార్కింగ్ సౌకర్యం ఫైర్ సేఫ్టీ లేకున్నా కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్లను తీసుకువచ్చి చికిత్స చేయిస్తూ ఇష్టం వచ్చిన రీతిలో అందినంత రోగుల నుండి వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల లోను అర్హత లేని నర్సులను నియమించి ఫార్మసిస్ట్ లేకుండానే మందులను అమ్మి ఇష్టం వచ్చిన రీతిలో రోగులకు అంట గడుగుతున్నారు. ఇదేమని రోగులు ప్రశ్నిస్తే దబాయించి భయపెడుతూ బెదిరిస్తూ మీకు ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం ఉన్న కాడ చెప్పుకొమ్మని బెదిరిస్తున్నారని బాధిత రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమని రోగులు జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రికి చిన్నపాటి జ్వరం, ఇతర నొప్పులతో ఆసుపత్రికి వస్తే రోగి నుండి నానా రకాలుగా డబ్బులు దండుకుంటున్నారు.
ఓపీ ఫీజు మొదలు
వివరాలకు వెళ్తే ఏదైనా ఒక రోగి ఆస్పత్రికి వస్తే ఓ.పి. ఫీజు నుండి మొదలుకొని చివరికి మందులు తీసుకునే వరకు సుమారుగా 10,000, వేల రూపాయలు ఖర్చు అవుతుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటగా ఓ.పి. ఫీజు అని 300 నుండి 400, వరకు వసూలు చేస్తూ డాక్టర్ చూసిన తర్వాత ఈమె, ఆయనకు రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. రక్త పరీక్షలు చేస్తే తప్ప మందులు రాయరాదు అని డాక్టర్ చెప్తాడు. సరే అని సదరు రోగి డాక్టర్ చెప్పినట్లుగా రోగి రక్త పరీక్షల కోసం సుమారు 2000, నుండి 3000, వరకు “ల్యాబ్” పరీక్షల కోసం చెల్లిస్తాడు ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్కు చూపించమని సదరు సిస్టర్ లేదా ల్యాబ్ వ్యక్తి చెప్పి పంపిస్తాడు. డాక్టర్ దగ్గరికి లోపలికి వెళ్లిన తర్వాత డాక్టర్ చూసి అమ్మ లేదా అతను నీ ఆరోగ్యం చాలా బాగాలేదు ఈ మందులు వాడండి అని చెప్పి ఓ పి. చూయించుకున్న “స్లిప్” పైన మందుల చిట్టిని వ్రాసి పంపిస్తాడు. అలాగే సదరు మెడికల్ షాప్ కు వచ్చిన తర్వాత ఆమె, ఆయన, సార్ మందుల కోసం ఎన్ని డబ్బులు అయినాయి చెప్పండి అని అడగగా 4000, నుండి 5000, రూపాయలు అవుతాయి అమ్మ అని మందుల షాపులో ఉండే అతను చెప్తాడు. సరే ఇవ్వండి అని సమాధానం చెబుతారు. ఆ తర్వాత సదరు సిస్టర్ ఈ సమయంలో ఈ మందులు వేసుకోవాలమ్మ అని చెప్పి పంపిస్తుంటుంది.
10 వేలు లేకుండా ప్రైవేటుకు పోలేం
ఒక రోగి ఆరోగ్యం బాగోలేకుంటే ఆసుపత్రికి వెళితే సుమారుగా పదివేల రూపాయల వరకు ఒక వ్యక్తి దగ్గర ఉండాల్సిందే ఎందుకంటే రక్త పరీక్షల కోసం వేసు కునే మందుల కోసం అన్నింటికీ కలిపి సుమారుగా పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మరి ఇంత తతంగం జరిగిన జిల్లా అధికార యంత్రం గాని స్థానిక అధికారి యంత్రము గాని ఎవరు కూడా పట్టించు కోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటగా ప్రైవేటు ఆసుపత్రులు ఒక కిరాయి కొంపలో ప్రారంభించి మరి అతి తక్కువ సమయంలో సొంత భవనం నిర్మించుకొని మరి ప్రైవేటు ఆసుపత్రులు యదేచ్చగా రోగుల నుండి దండుకుంటున్న మరి అధికారం నిమ్మకు నీరెట్టినట్టుగా పట్టించు కోకపోవడంపై సర్వత్ర విమర్శలకు దారితీస్తుంది. వారి ప్రైవేటు ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసు కోకపోవడం తో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహ కులు యజమానులు రోగాల నుండి అందినంత దోచుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం పట్టించు కోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.