జై భీం అంటూ 125 అడుగుల ఎత్తున భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. రాజధాని హైదరాబాద్ లోని సచివాలయం పక్కనే ఏర్పాటు చేసిన ఈ భారీ విగ్రహాన్ని అంబేద్కర్ మనువడు ప్రకాష్ అంబేద్కర్ తో కలిసి కేసీఆర్ ప్రారంభించారు. విగ్రహాన్ని జాతికి అంకితం చేశాక హెలిక్యాప్టర్ తో పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేసిన కేసీఆర్ తన ప్రసంగంతో సభికులను ఆకట్టుకున్నారు.
ఏటా అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తున్నా దళితుల జీవితాలు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ తత్వాన్ని అమలు చేయాలన్న కేసీఆర్ దేశవ్యాప్తంగా దళితబంధు ఇచ్చే రోజు వస్తుందన్నారు. ఈరోజు ఆవిష్కరించినది విగ్రహం కాదని అదని విప్లవమని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి, కేంద్రంలో పాగా వేస్తుందన్నారు కేసీఆర్.