Tuesday, October 1, 2024
HomeతెలంగాణJaipal Yadav: వెల్జాల్ లో గొర్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Jaipal Yadav: వెల్జాల్ లో గొర్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

యాదవులకు రెండో విడత గొర్ల పంపిణి

కల్వకుర్తి నియోజకవర్గ పరిధినిలోని తలకొండపల్లి మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, వెల్జాల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన యాదవులకు రెండో విడత గొర్ల పంపిణి కార్యక్రమం అంగరంగ వైభవంగా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పిటిసి ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, స్థానిక సర్పంచ్ సంగీత శ్రీనివాస్ యాదవ్, జిల్లా కో అప్షన్ ముజుబుర్ రహేమాన్, ఏఎంసి చెర్మన్, శ్రీనివాస్ రెడ్డి మాజీ జడ్పీటీసీ పద్మ నర్సింహా హాజరయ్యారు. అనంతరం వచ్చిన అతిథులకు గ్రామ యాదవ యాదవ సంఘం అధ్యక్షుడు, గోద జంగయ్య, యాదవులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏ సి ఎస్ వైస్ చెర్మన్ కూన రవి కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు ఎంపిటిసిలు వార్డు సభ్యులు మండల స్థాయి అధికారులు, మండల గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News