Friday, April 18, 2025
HomeతెలంగాణJammikunta: ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ

Jammikunta: ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ

జమ్మికుంట మున్సిపాలిటీ తోపాటు గ్రామ గ్రామాన బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరించి ఘనంగా జరుపుకున్నారు. ఆయా కాలనీలో, గ్రామాల కూడళ్ల వద్ద భారీగా హాజరైన కార్యకర్తలు, నాయకుల సమక్షంలో కాలనీల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు జెండా ఎగరవేసి మిఠాయిలు పంపిణీ చేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని( 21) వార్డులో మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. (19)వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్నకోటి జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం హుజురాబాద్ లో జరిగిన ప్లీనరీ సమావేశానికి ప్రజాప్రతినిధులు, బి.ఆర్.ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తరలి వెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News