జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది కి హుజురాబాద్ ఏసిపి వెంకట్ రెడ్డి నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమావేశంలో ఏసిపి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 3న ఉదయం 10:30 సమయంలో , బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నిస్తున్న పుప్యాల శ్రీలత (32) అనే వివాహితను గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న బ్లూ కోట్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి శ్రీలతను కాపాడి ఆమెను జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు తరలించగా పట్టణ సీఐ రమేష్ ఎస్సై యూనిస్ అహ్మద్ శ్రీలత కుటుంబ సభ్యులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ఆమెను క్షేమంగా ఇంటికి పంపించినట్లు ఏసీపీ తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే స్పందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన హెడ్ కానిస్టేబుల్ సారంగధర్, హోంగార్డులు జలీల్ ఆనంద్ లకు ఎసిపి వెంకట్ రెడ్డి పట్టణ సీఐ బి రమేష్ నగదు రివార్డు అందించి అభినందించారు. పోలీస్ శాఖలో కష్టపడి పని చేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని సమస్యల పట్ల తక్షణమే స్పందించే సిబ్బందికి ఉన్నత అధికారులు తప్పకుండా గుర్తిస్తారని ఆయన అన్నారు, త్వరలోనే కరీంనగర్ సిపి చేతుల మీదుగా కూడా రివార్డు ప్రశంస పత్రాలను అందించనున్నట్లు చెప్పారు.