భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే ఈటల సంపత్ రావుకు పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంపత్ రావు మాట్లాడుతూ ఈటల రాజేందర్ బిజెపిలో చేరినప్పటి నుండి తనకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తూ రాజకీయంగా తన ఎదుగుదలకు ప్రోత్సహిస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుజరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, హుజురాబాద్ మండల అధ్యక్షులు రాముల కుమార్, ఇల్లందకుంట మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు పల్లె వెంకట్ రెడ్డి, మల్యాల సర్పంచ్ గురుకుంట్ల సాంబయ్య, ఆరెల్లి సంజీవ్, ఎండీ షఫీ, మారం తిరుపతి రెడ్డి, పోతుల సంజీవ్, పల్లేని దేవేందర్ రావు, మౌటం వెంకటేష్, నర్రా మధుకర్ రెడ్డి,మోతే స్వామి, నాసిరొద్దిన్, బొంగోని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.