Saturday, October 5, 2024
HomeతెలంగాణJammikunta: ఘనంగా నేతాజీ తాపీ కార్మిక సంఘం వేడుకలు

Jammikunta: ఘనంగా నేతాజీ తాపీ కార్మిక సంఘం వేడుకలు

జమ్మికుంట పట్టణంలో నేతాజీ తాపీ కార్మిక సంఘం 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, సంఘం అధ్యక్షుడు బిట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ తాపీ కార్మికులను నేతాజీ తాపీ కార్మిక సంఘం నూతన కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BRS నాయకుడు కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య, హాజరై, మాట్లాడుతూ. నూతన కమిటీ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు, గృహ నిర్మాణాలకు తాపీ.కార్మికుల కృషి చాలా గొప్పదని అన్నారు. కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు జరుపు కోవడం ఆనందంగా ఉందన్నారు. గత 40 సంవత్సరాలుగా తాపీ కార్మికులుగా పనిచేస్తున్న సీనియర్ తాపీ కార్మికులను సన్మానించడం గర్వంగా ఉందని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నేతాజీ తాపీ కార్మిక సంఘం, అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి శనిగరపు తిరుపతి, వెంకట్ రెడ్డితో పాటు కార్మిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News