Friday, September 20, 2024
HomeతెలంగాణJammikunta: అన్నదాతలకు అండగా ప్రభుత్వం

Jammikunta: అన్నదాతలకు అండగా ప్రభుత్వం

అన్నదాతలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడని, అన్నదాతలు కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలలో విక్రయించి ప్రభుత్వం చెల్లిస్తున్న మద్దతు ధరను పొందాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట కొత్త వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిచ్చేయంతో ఉన్నట్లు చెప్పారు. తడిసిన వరి ధాన్యాన్ని సైతం మద్దతు ధరకే కొనుగోలు చేసేందుకే దృష్టి సారించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. గత రెండేళ్లుగా మద్దతు ధరకు మించి ప్రైవేట్ వ్యాపారులే మొక్కజొన్నలు కొనుగోలు చేస్తుండడంతో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం రాలేదన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ మద్దతు ధర కంటే ప్రైవేట్ వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం మరల మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించేందుకు దృష్టి సారించింది అన్నారు. మొక్కజొన్న రైతులు కూడా దళారులకు తాము పండించిన పంటను విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలోనే మొక్కజొన్నలు విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర రూ.1962లను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు, కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగళి రమేష్, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News