Thursday, September 19, 2024
HomeతెలంగాణJammikunta: సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన పాడి కౌశిక్

Jammikunta: సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన పాడి కౌశిక్

గ్రామీణ ప్రాంతల క్రీడాకారులను ప్రోత్సాహించడంతో పాటు వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కప్ -2023 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్ – 2023 మండల స్థాయి క్రీడా పోటీలను సోమవారం హుజరాబాద్ జమ్మికుంట మండల కేంద్రాలలో ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహించడంతో పాటు వారిని నైపుణ్యాన్ని వెలికితీయాలానే ఉద్దేశ్యంతో సీఎం కప్ 2023 కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ముందుగా మండల స్థాయిలో మూడు రోజులపాటు అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్‌ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను జిల్లా పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపితే రాష్ట్ర స్థాయిల్లో అవకాశం కల్పిస్తారని వెల్లడించారు. గ్రామీణ క్రీడాకారులకు వారి ప్రతిభను ప్రదర్శించేందుకు సీఎం కప్ చక్కటి వేదిక అవుతుందని అన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయ, జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి, జడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్, తాహసిల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో కల్పన, మండల ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News