Saturday, April 12, 2025
HomeతెలంగాణJammikunta: రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ కు స్పెషల్ కోఆర్డినేటర్ గా సజ్జు

Jammikunta: రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ కు స్పెషల్ కోఆర్డినేటర్ గా సజ్జు

సంచలనాత్మక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ యువ శక్తిని మేల్కొల్పే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ కు హుజురాబాద్ నియోజకవర్గానికి క్విజ్ కాంపిటీషన్ స్పెషల్ కోఆర్డినేటర్ గా జమ్మికుంటకు చెందిన మహమ్మద్ సజ్జాద్ ను నియమించినట్లు తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనేవారు 7661 899 899 అనే నంబర్ కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా లింక్ వస్తుందన్నారు. ఈ లింకులో రిజిస్ట్రేషన్ చేసుకొనే చివరి తేదీ జూన్ 17 సాయంత్రం ఐదు గంటల వరకు, జూన్ 18వ తేదీ ఆన్లైన్లో ఈ పరీక్షను నిర్వహిస్తామన్నారు. యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 44 బహుమతులను గెలుపొందిన వారికి ఇస్తామన్నారు. మొదటి బహుమతి లాప్టాప్ , రెండవ బహుమతి స్మార్ట్ ఫోన్ , మూడో బహుమతి ట్యాబ్ , ప్రతి నియోజకవర్గానికి ఒక మహిళా టాపర్ కు స్పెషల్ గిఫ్ట్ గా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ , పది స్మార్ట్ వాచ్లు , 10 ఇయర్ బర్డ్స్, పది హార్డ్ డ్రావ్స్ , 10 పవర్ బ్యాంకులను బహుమతిగా ఇవ్వడం జరుగుతుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News