జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి ఆధ్వర్యంలో ఆర్ ఆర్ ఆర్ (రెడ్యూస్, రీ యూస్, రిసైకిల్ ) సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న కోటి మాట్లాడుతూ మన ఇంట్లో వాడి ఉన్న పాత బట్టలు, పుస్తకాలు, బొమ్మలు, తిరిగి వాడుకునే ప్లాస్టిక్ వస్తువులు,వాడిన చెప్పులు, షూస్ ఇతర వస్తువులను ఆర్ ఆర్ ఆర్ సెంటర్లో అందజేయాలని స్థానిక ప్రజలకు సూచించారు. కాలనీవాసుల దగ్గర సేకరించిన వస్తువులని లేని వారికి ఇస్తామన్నారు. మిగిలిన వాటిని రిసైక్లింగ్ చేసే కంపెనీలకి పంపిస్తామన్నారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని, వార్డు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు జేరిపోతుల సృజన. ఎండి భాను అంగన్వాడి టీచర్ మొట్టపోతుల రామ మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.