Friday, September 20, 2024
HomeతెలంగాణJammikunta: RRR సెంటర్లు ఏర్పాటు చేయరేం?

Jammikunta: RRR సెంటర్లు ఏర్పాటు చేయరేం?

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 30వార్డులలో ఆర్ ఆర్ ఆర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్ ఆర్పీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని, 30 వార్డులలో ఆర్ ఆర్ ఆర్ (రెడ్యూస్, రీ యూస్, రిసైకిల్ ) సెంటర్లను ఏర్పాటు చేయాలని, ప్రతి ఇంటిలో వాడిన బట్టలు, పాత పుస్తకాలు, వాడిన షూస్, బోమ్మలు, ప్లాస్టిక్ ఐటమ్స్ ప్రజల దగ్గర సేకరించి దీనస్థితిలో ఉన్న పేదవారికి వారికి ఇస్తే ఉపయోగ పడుతాయని, మిగిలిన వస్తువులని రిసైకిల్ చేసే కంపెనీలకు పంపించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి వార్డులో తప్పనిసరిగా ఆర్ ఆర్ ఆర్ సెంటర్ లు ఏర్పాటు చేయడంపై ఆర్పీలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ సదానందం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News