Tuesday, September 17, 2024
HomeతెలంగాణJammikunta: అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం

Jammikunta: అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం

హుజరాబాద్ నియోజకవర్గంలో మార్చి ఏప్రిల్ మాసాలలో అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న విషయంపై హుజరాబాద్ రైతువేదిక భవన్లో నియోజకవర్గ స్థాయి వ్యవసాయ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండలాలలో రైతులకు అపార నష్టం జరిగిందని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని సంకల్పంతో వ్యవసాయ అధికారులతో ప్రతి గ్రామంలో సర్వే జరిపించామని ప్రభుత్వపరంగా నష్టపోయిన రైతులందరికీ ఆదుకుంటామని కౌశిక్ రెడ్డి వివరించారు.

- Advertisement -

మార్చి ఏప్రిల్ మాసాల్లో పలుమార్లు కురిసిన అకాల వర్షాల కారణంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి రైతుల వివరాలను తెలిపారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన వ్యవసాయ శాఖ సిబ్బంది తెలిపిన వివరాలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సమావేశంలో అధికారులతో చర్చించారు. వ్యవసాయ అధికారుల పరిశీలన ప్రకారం ఇప్పటివరకు రైతుల సంఖ్య నష్టం జరిగిన పంట పొలాల విస్తీర్ణం పట్టి ఆయా రైతులకు ప్రభుత్వ ఆదేశానుసారం త్వరలోనే పంట నష్టపరిహారం అందిస్తామని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి రైతును ఆదుకోవడం తన బాధ్యతగా గుర్తించి ఈ వ్యవసాయ రివ్యూ సమావేశాన్ని నిర్వహించినట్టు తెలిపారు. గ్రామాలలో పంట నష్టం జరిగే బాధలలో ఉన్న రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News