జనగామ జిల్లా దేవరుప్పులలో రేపు నిర్వహించనున్న పాలకుర్తి నియోజకవర్గ బిఆర్ ఎస్ పార్టీ ప్రతినిధుల సభా ప్రాంగణాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. సభా ప్రాంగణం, ఆహార ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ఏర్పాట్లు చేస్తున్న నేతలు, కార్యకర్తలతో మంత్రి మాట్లాడారు. ఏర్పాట్లపై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. పనుల వేగం పెంచాలని, రేపు ఉదయం కల్లా ఏర్పాట్లన్నీ పూర్తవ్యాలని చెప్పారు. సభా నిర్వహణపై మంత్రి తగు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.