Saturday, November 15, 2025
HomeతెలంగాణJanagama: బీఅర్ఎస్ పార్టీ ఆఫీసులో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు

Janagama: బీఅర్ఎస్ పార్టీ ఆఫీసులో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు

జనగామ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కేసీఆర్ బర్త్ డే కేక్ కట్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సంకల్పించిన కలని సాకారం చేయడం, కష్టాలెన్నైనా ఎదిరించి గమ్యాన్ని ముద్దాడటం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయడం, అనతి కాలంలోనే తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలపడం సీఎం కెసిఆర్ గారికే చెల్లిందని ఈ సందర్భంగా ఎర్రబెల్లి అన్నారు. 14 ఏళ్ల పాటు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ 9 ఏళ్ల పాలనతో తెలంగాణ అభివృద్ధిని దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగామ జెడ్పీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, పలువురు నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad