Friday, September 20, 2024
HomeతెలంగాణJanagama: కేసులు పెట్టించడం నాన్నకు కొత్తేమి కాదు

Janagama: కేసులు పెట్టించడం నాన్నకు కొత్తేమి కాదు

ఎమ్మెల్యే కుమార్తె తుల్జా భవాని రెడ్డి

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కూతురు తుల్జాభవానీ రెడ్డి వివాదంలో మరో మలుపు చోటుచేసుకుంది. చేర్యాలకి వచ్చిన తుల్జా భవాని తనపై వచ్చిన ఫిర్యాదుపై స్పందిస్తూ మా నాన్న నియ్యత్ అంట్లాంటిది..ఆయన ఎంటో తెల్వదా..అందరూ సంతోషంగా ఉంటూ సంత జరుగుతుంటే ఆయన చూడలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించింది. మున్సిపాలిటికి ఇచ్చిన స్థలంలో కొబ్బరికాయ కొట్టి పశువుల అంగడిని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎదురెదురుగా తారసపడ్డ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవాని మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ‘నేనే మిమ్మల్ని మీ నాన్నపై కేసులు పెట్టే విధంగా ఉసిగొల్పుతున్నాని ఆరోపణలు చేస్తున్నాడని కొమ్మూరి అడగ్గా.. మీరెవరో నాకు తెలియదు మిమ్మల్ని నేను మొదటి సారి చూస్తున్నా అంటూ ఆమె సమాధానం చెప్పారు. ఈసందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాకతీయుల కాలంలో నిర్మించిన చేర్యాల పెద్ద చెరువు మత్తడి స్థలం అప్పటి ఇంజనీర్లు ప్లాన్ ప్రకారం బై ఫర్ జోన్ మత్తడి నీళ్లు కింది నుండి చేర్యాల కుడి చెరువుకు వెళుతుంటాయని వరద కాలువ సాకు చూపి తన బిడ్డ పేరు మీద అక్రమంగా ఫోర్జరీ సంతకాలు చేసి కబ్జాలు చేసుకున్నాడని అది సహించలేని కుమార్తె స్వయంగా తన తండ్రి తప్పు చేశాడని చేర్యాల ప్రజలకు క్షమాపణ చెప్తున్నాను మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పడం ఆమె వివేకానికి నిదర్శనం అన్నారు. ప్రతి పశువుల సంత కొనసాగించాలని రైతులకు పిలుపునిచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్,మాజీ జెడ్పిటిసిలు కొమ్ము నరసింగా రావు,దాసరి కళావతి,టిడిపి రాష్ట్ర నాయకులు ఒగ్గురాజు,ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బీరయ్య,మత్తడి పరిరక్షణ సమితి చైర్మన్ అవుచర్ల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News