Friday, April 4, 2025
HomeతెలంగాణJayashankar Sir: రాష్ట్రం కోసం జీవితం త్యాగం చేసిన జయశంకర్ సార్

Jayashankar Sir: రాష్ట్రం కోసం జీవితం త్యాగం చేసిన జయశంకర్ సార్

సార్ వర్ధంతి వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని నేరేడుచర్ల బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు/మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలతా రెడ్డి అన్నారు. శ్రీలతా రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం చల్లా శ్రీలత రెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం ప్రజల్లో భావజాల వ్యాప్తిని రగిలించిన మహనీయులు, తెలంగాణ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. ప్రతీ ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ పార్టీ నాయకులందరూ ఘన నివాళులు ఆర్పిస్తున్నామని అన్నారు.

- Advertisement -

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ సైతం ఇదే కార్యక్రమంలో చేపట్టారు. మాలాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాదెండ్ల శ్రీధర్,పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, సీనియర్ నాయకులు వల్లంసెట్ల రమేష్ బాబు,ఆకారపు వెంకటేశ్వర్లు,కొనతం ఆదిరెడ్డి, బొడ్డుపల్లి సుందరయ్య,బుడిగె చంద్రయ్య,వల్లంకొండ హరిబాబు, చిట్యాల శ్రీను,గంట సైదులు, కొమర్రాజు నరేష్,ఇంజమూరి రాజేష్,షేక్ ఇష్థియాక్,పోకబత్తిని శేఖర్,ఎస్కే ఇంతియాజ్,సైదా, కొమర్రాజు వెంకట్,మారయ్య గౌడ్, కొమ్ము బిక్షం,సైదులు,వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News