Saturday, September 21, 2024
HomeతెలంగాణJeevan Reddy: అభివృద్ధికి అడ్డా ఆర్మూర్ గడ్డ

Jeevan Reddy: అభివృద్ధికి అడ్డా ఆర్మూర్ గడ్డ

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రథసారధి అని, ప్రజలే ఈ ప్రభుత్వానికి వారధి అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వందలాది మంది బీజేపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని బంజారహిల్స్ రోడ్ నెం.12 లో గల మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో ముదిరాజ్ సంఘాల నాయకులు మందుల పొశెట్టి, సాంబడి పొశెట్టి, మందుల ఎంజెఆర్, అశోక్, జంగిడి భాస్కర్, శిలా శ్రీకాంత్, తిట్ల భూమన్న, జక్కం గంగాధర్, పోస్టాఫీస్ భూమన్న, కట్కం సురేష్ ల ఆధ్వర్యంలో సంఘం సభ్యులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, కడుపులో పెట్టుకొని చూసుకుంటామని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
“తెలంగాణ గడ్డ అభివృద్ధికి అడ్డాగా మారింది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు. స్ఫూర్తి దాయకమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశంలో కెల్లా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దు తున్నారు. ప్రజల ఆశీస్సులతో మూడోసారి గెలుస్తా. అభివృద్ధిలో ఆర్మూర్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా నిలుపుతా” అని జీవన్ రెడ్డి అన్నారు.

- Advertisement -




సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News